క్రిటికల్ పోలింగ్ బూత్‌ల పరిశీలన
NEWS Feb 02,2026 06:21 pm
మెట్‌పల్లిలోని క్రిటికల్ పోలింగ్ బూత్‌లను రాష్ట్ర జనరల్ అబ్జర్వర్ (పుర ఎన్నికల పరిశీలకుడు) కాళీ చరణ్ ఐఏఎస్ పరిశీలించారు. పుర ఎన్నికల ఏర్పాట్లను మరింత వేగవంతం చేసి, ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని కాళీ చరణ్ అధికారులకు సూచించారు. భద్రత, సౌకర్యాల పరంగా ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, ఎమ్మార్వో శ్రీమతి నీతా, మున్సిపల్ కమిషనర్ టీ. మోహన్, డీఈ నాగేశ్వరరావు, సీఐ అనిల్ కుమార్, సానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.