జనసేన అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ
NEWS Feb 01,2026 09:26 pm
మెట్‌పల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో, నిజామాబాద్ జిల్లా పార్లమెంటరీ ఇంచార్జ్ మచ్చ సుధాకర్ నాయకత్వంలో బీ-ఫారాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మెట్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన తరఫున మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. పార్టీ సీనియర్ నాయకులు రామారావు, గంగం అజయ్, కోఆర్డినేషన్ కమిటీ నాయకులు ఎలగందుల అజయ్ కుమార్, అబ్బూరి ఆనంద్, సౌజన్య, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు సమిష్టిగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.