కేసీఆర్‌ను విచారిస్తున్న సిట్
NEWS Feb 01,2026 03:34 pm
HYD: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను నందినగర్‌లోని ఆయన నివాసంలో సిట్ అధికారులు విచారిస్తున్నారు. పలు డాక్యుమెంట్లు, పరికరాలతో సిట్ అధికారులు కేసీఆర్ నివాసానికి వెళ్లారు. సిట్ విచారణ నేపథ్యంలో నందినగర్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కేసీఆర్ నివాసంలోకి కుటుంబసభ్యులు, సిట్ అధికారులను మాత్రమే పోలీసులు అనుమతించారు. పార్టీ శ్రేణులు, అనుచరులు ఇంట్లోకి రాకుండా ఆంక్షలు విధించారు. మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్, హరీశ్‌రావు అదే నివాసంలోనే ఉన్నారు.