బల్లేపల్లి మోహన్‌పై వెంకయ్య ప్రశంసలు
NEWS Jan 15,2026 04:13 am
మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ బల్లేపల్లి మోహన్ వేమన పద్యాలను గానం చేస్తూ డిజిటలైజేషన్ చేస్తున్న కార్యక్రమంలో వంద ఎపిసోడ్‌లలో 700 వేమన పద్యాలను పూర్తి చేసిన సందర్భంగా రూపొందిం చిన సీడీని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయు డు ఆవిష్కరించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవ ర్నర్ ఇంద్రసేనారెడ్డి, బ్రహ్మానందం, సృజనా చౌదరి, కేవీపీ రామచంద్ర రావు, లక్ష్మణ్, రామచంద్ర రావు, గరికపాటి నరసింహారావు పాల్గొన్నారు. వేమన తత్వాన్ని భావి తరాలకు చేరువ చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ బల్లేపల్లి మోహన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.