లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పతంగులు కొనుగోలు చేస్తున్నారు. బుధవారం మార్కెట్ ప్రాంతమంతా పండుగ సందడితో కళకళలాడింది. రంగురంగుల పతంగులు, దారాలు, ఇతర సామగ్రితో దుకాణాలు కిటకిటలాడాయి. సంక్రాంతి వచ్చిందంటే పతంగులు ఎగరేయడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని కొనుగోలుదారులు తెలిపారు. ఇంటింటా రంగురంగుల ముగ్గులు అలంకరిస్తుండగా, ఆకాశమంతా గాలిపటాలతో సవ్వడి వినిపిస్తోంది. సంప్రదాయం, ఆనందం కలిసి సంక్రాంతి సంబరాలు గ్రామాన్ని పండుగ వాతావరణంతో నింపాయి.