కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనమిచ్చింది. మకర జ్యోతి కోసం భక్తుల జయ జయ ధ్వానాలతో కేరళ కొండలు మార్మోగి పోయాయి. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పొన్నంబలమేడు కొండలపై మకరజ్యోతి 3సార్లు భక్తులకు దర్శనమిచ్చింది. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు సన్నిధానం, పంబ, ఇలువంకల్ వంటి ప్రాంతాలకు చేరుకున్నారు.