వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులుగా డా. రఘు
NEWS Jan 14,2026 06:33 pm
వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా గౌరవ అధ్యక్షులుగా మెట్ పల్లి నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ చిట్నేని రఘు నియామకం అయినట్లు జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఉరుమండ్ల మహేష్ తెలిపారు. వెయిట్ లిఫ్టింగ్ క్రీడ అభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమానికి, జిల్లాలో యువ క్రీడాకారులను మరింత ప్రోత్సహించడానికి డాక్టర్ రఘు కృషి చేస్తారని పేర్కొంటూ ఈ నియామకం జరిపినట్లు తెలిపారు. జిల్లాలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడను మరింత ప్రోత్సహించడానికి డాక్టర్ రఘు చిట్నేని సలహాలను, సూచనలను పాటిస్తామని పేర్కొన్నారు. డాక్టర్ రఘు నియామకం పట్ల అసోసియేషన్ సభ్యులు, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.