నిర్మల్ జిల్లా వాల్మీకి నగర్ కాలనీలోని శ్రీ సీతారాముల వారి ఆలయంలో గోదాదేవి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం మంగళహారతులతో పాటు డీజే పాటల నడుమ పల్లకిని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. భక్తులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు మాట్లాడుతూ, ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా గోదాదేవి కళ్యాణం జరుపుకోవడం ఆనందంగా ఉందని, గోదాదేవి కరుణ కటాక్షాలు భక్తులందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మహిళలు సహా కాలనీవాసులు విశేషంగా పాల్గొన్నారు.