భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం
NEWS Jan 14,2026 06:41 pm
నిర్మల్ జిల్లా కేంద్రంలోని TNGO కార్యాలయంలో భీమ్ ఆర్మీ జిల్లా కమిటీ నియామకాలు జరిగాయి. భీమ్ ఆర్మీ నిర్మల్ జిల్లా కార్యదర్శిగా lబట్టు రవీందర్‌ను, పట్టణ ఉపాధ్యక్షులుగా తోట భరత్‌ను, పట్టణ ప్రధాన కార్యదర్శిగా కొల్లూరు నవీన్‌ను రాష్ట్ర కార్యదర్శి నిగులపు లింగన్న నియమించారు. మహనీయుల ఆశయాలు, ఉద్యమ లక్ష్యాలను మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అన్ని కులాలు, మతాలకు అతీతంగా భీమ్ ఆర్మీ అండగా ఉంటుందని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి నిజాయితీగా పనిచేస్తామని స్పష్టం చేశారు.