మెట్‌పల్లి మున్సిపాలిటీ 25వ వార్డు నుంచి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి అబ్దుల్ మతీన్ దరఖాస్తు చేసుకున్నారు. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ జువ్వాడ నరసింగరావు, పార్టీ నేతలు కొమిరెడ్డి విజయ్ ఆజాద్‌తో కలిసి వినతిపత్రాన్ని అందించారు. గతంలో తన తల్లిదండ్రులు, అన్నయ్య సలీం 25వ వార్డు ప్రజలకు కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్‌గా సేవలందించారని, తాను కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ రాజకీయ అనుభవం సంపాదించుకున్నానని అబ్దుల్ మతీన్ తెలిపారు. 25వ వార్డు ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని,పార్టీ తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.