అనాదిగా వస్తున్న ఆచారాలను గౌరవిస్తూ ఐకమత్యంతో పండుగలు జరుపుకోవాలని నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఎస్.జె.కె. అహ్మద్ అన్నారు. భోగి పండుగ సందర్భంగా పాల్వంచ పట్టణ పరిధి వనమా కాలనీలో స్థానికులు నిర్వహించిన భోగి వేడుకలను ఆయన సందర్శించి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి ప్రపంచానికి ఆదర్శమని, పండుగలు మానవ సంబంధాలను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.