పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని గాంధీనగర్‌లో భోగి పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గాంధీనగర్ ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, చిన్నారుల కోలాటాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భోగి మంటలు వెలిగించి కాలనీ వాసులు పిల్లలు–పెద్దలు తేడా లేకుండా ఉత్సాహంగా పాల్గొన్నారు. పాతదాన్ని విడిచిపెట్టి కొత్తదాన్ని స్వాగతించే భోగి పండుగ రైతులకు సిరులు తెచ్చే పండుగగా ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు.