నేడే శబరిమలలో మకర జ్యోతి దర్శనం
NEWS Jan 14,2026 12:39 am
శబరిమలలో నేడు మకర జ్యోతి దర్శనం. నేటి సాయంత్రం 6:25-6.55 గంటల మధ్య పొన్నాంబల కొండపై కనిపించనుంది. సాక్షాత్తు మణికంఠుడే ఈ జ్యోతిగా దర్శనమిస్తారని భక్తులు విశ్వసిస్తారు. కాగా రేపు వర్చువల్ క్యూ ద్వారా 30,000 మందికే అనుమతి ఉంది. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఇప్పటికే దేవస్వం బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జనవరి 19 రాత్రి వరకు అయ్యప్ప దర్శనానికి అవకాశం ఉండగా 20వ తేదీన ఆలయం మూసివేయనున్నారు.