మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించండి
NEWS Jan 14,2026 12:41 am
కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో పొంగులేటి క్యాంపు కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. యువతులు, మహిళలు రంగురంగుల ముగ్గులతో స్టేడియం ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు.ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఆరవ తరగతి విద్యార్థిని, ప్రకృతి హరిత దీక్షకురాలు నైనిక రజువా మొక్కను అందజేసి పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను తెలియజేశారు. అలాగే ముగ్గుల పోటీల్లో పాల్గొని “మొక్కలు నాటండి – పర్యావరణాన్ని పరిరక్షించండి” అనే సందేశంతో అవగాహన కల్పించారు.