ములుగు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ELTA ఆధ్వర్యంలో జిల్లా స్థాయి TED-Ed స్టూడెంట్ టాక్, ఒలింపియాడ్ పోటీలు జరిగాయి. స్టూడెంట్ టాక్ పోటీలో ZPHS రామన్నగూడెం విద్యార్థి యశ్వంత్ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో రాష్ట్ర స్థాయి TED-Ed స్టూడెంట్ టాక్ పోటీల్లో ములుగు జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా DEO సిద్ధార్థ రెడ్డి, AMO శ్యామ్ సుందర్ రెడ్డి యశ్వంత్ ను అభినందించారు.