బుచ్చయ్యపేట: వడ్డాది గ్రామంలో NTS స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంక్రాంతి సంబరాలు వేడుకలను వడ్డాది స్టేట్ బ్యాంక్ మేనేజర్ ప్రారంభించారు. విద్యార్థులకు ఉపాధ్యాయులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. దేశ సంస్కృతికి సాంప్రదాయాలకు నిదర్శనంగా ఈ వేడుకలను విద్యార్థులకు తెలిపేందుకు యేటా నిర్వహిస్తామని స్కూల్ కరెస్పాండెంట్ VV రామరాజు చెప్పారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులందరూ ఉత్సాహంగా ముగ్గులు పోటీల్లో పాల్గొన్నారు.