డబ్బులు వసూళ్లు - ముగ్గురు అరెస్టు
NEWS Jan 09,2026 08:38 pm
కోరుట్లలో సెల్‌ఫోన్ వ్యాపారులను బెదిరించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కోరుట్ల మొబైల్ అసోసియేషన్ పేరుతో షాపులు నిర్వహిస్తున్న మార్త శివకుమార్, భోగ శ్రీనివాస్, అడ్డగట్ల సురేష్‌లు, ఎయిర్టెల్ నెట్‌వర్క్ సేవలు ఇక్కడ వ్యాపారం చేయాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని వీడియో కాల్‌లో తుపాకులు, కత్తులు చూపించి బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. భయంతో రూ.30 వేలును ఆన్‌లైన్‌లో ట్రాన్స్ఫర్ చేశామని ఎయిర్టెల్ డివిజనల్ డిస్ట్రిబ్యూటర్ దండే బోయిన అరుణ్ ఫిర్యాదు చేయడంతో, పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి కత్తులు, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కోరుట్లలో కలకలం రేపింది.