కథలాపూర్: దుంపెట్ట గ్రామంలోని శివాజీ విగ్రహం సమీపంలో, చింతకుంట ఎక్స్‌రోడ్ వద్ద రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలని సర్పంచ్ రమేష్, ఉపసర్పంచ్ డిపో మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. రిక్వెస్ట్ స్టాప్ లేకపోవడంతో గ్రామస్తులు అర కిలోమీటర్ దూరం నడవాల్సి వస్తోందని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులకు బస్సు ఎక్కడం కష్టంగా మారిందని వారు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు వెంటనే స్టాప్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత పాల్గొన్నారు.