కథలాపూర్: ఇప్పపెల్లి గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు అటవీ భూమిని అక్రమంగా చదును చేయడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. చదును చేసిన భూమి వద్దకు చేరిన వారు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు వ్యక్తులు అటవీ భూమిని స్వంత ప్రయోజనాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. సమాచారం అందుకున్న సెక్షన్ ఆఫీసర్ ముస్తాఫా అక్కడికి చేరుకుని, చదును చేసిన భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. భవిష్యత్తులో అక్కడ మొక్కలు నాటే చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.