కథలాపూర్ మండల కేంద్రంలోని కళాధర హై స్కూల్‌కు చెందిన విద్యార్థులు నిజామాబాద్ జిల్లాలోని సుభాష్ గార్డెన్ కు విజ్ఞాన విహారయాత్రకు వెళ్లారు. గార్డెన్‌లోని ఆటవస్తువులతో విద్యార్థులు ఉత్సాహంగా ఆటపాటల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విద్యార్థులకు చదువుతో పాటు విజ్ఞాన విహారయాత్రలు కూడా ఎంతో అవసరమని అన్నారు. ఈ విహారయాత్ర విద్యార్థులకు ఆనందంతో పాటు కొత్త అనుభవాన్ని అందించిందని తెలిపారు.