రాజకీయ నాయకుల తిట్ల దండకాలతో విసుగెత్తిన ప్రజలకు నిన్నటి ఓ దృశ్యం ఊరటనిచ్చింది. ఈగోలను పక్కనపెట్టి మంత్రులు సీతక్క, సురేఖ మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసి మేడారం జాతరకు ఆహ్వానించారు. ఆయన కూడా అంతే ఆప్యాయంగా వారికి చీరలు బహూకరించారు. రాజకీయాలన్నీ ఎన్నికల వరకే పరిమితమైతే ఇలాంటి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ ఫోటో పాలిటిక్స్ లో వైరల్ గా మారింది. AP లోనూ ఇలాంటి వాతావరణం ఉండాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.