రావికమతం గ్రామ శ్మశాన వాటిక పరిసరాల్లో చెత్త, కోళ్ల వ్యర్థాలు పడేయడంతో తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. దీంతో గ్రామస్తులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించి, ఇకపై శ్మశాన వాటిక వద్ద చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.