చోడవరం–నర్సీపట్నం B.N రోడ్డుపై ఏర్పడ్డ భారీ గొయ్యిలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహన ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 18 నెలలు గడిచినా రోడ్డు పనులు ప్రారంభం కాకపోవడం విమర్శలకు దారితీస్తోంది. రోడ్డు పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని రవాణా, రోడ్లు & భవనాలు శాఖ అధికారులను ప్రజలు కోరుతున్నారు.