ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ గ్రాండ్‌గా విడుదలైంది. థియేటర్ల వద్ద అభిమానుల సందడి కనిపించింది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘మొసలి’ మీమ్స్ ఈసారి థియేటర్లకూ చేరాయి. క్లైమాక్స్‌లో ప్రభాస్ మొసలితో పోరాడే సీన్ రాగానే ఫ్యాన్స్ తెచ్చుకున్న మొసలి బొమ్మలతో స్క్రీన్ ఎదుట హంగామా చేశారు. ప్రభాస్ ఫైట్‌ను అనుసరిస్తూ బొమ్మలతో ఫైట్ చేస్తూ ఆ సన్నివేశాన్ని రీక్రియేట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వినూత్న సెలబ్రేషన్ థియేటర్లను పండుగ వాతావరణంతో నింపింది.