చైనాలో కోతులకు అనూహ్యమైన డిమాండ్ ఏర్పడింది. ఒక్క కోతికి రూ.20–25 లక్షల వరకు ధర పలుకుతోంది. బయోటెక్ రంగం వేగంగా విస్తరించడంతో వైద్య పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్‌కు భారీ సంఖ్యలో కోతులు అవసరమవుతున్నాయి. కానీ అవసరమైనంత లభ్యత లేకపోవడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 2025లో ప్రారంభమైన అనేక బయో ప్రాజెక్టులు కోతుల కొరతతో ఆగిపోయాయి. ఇక భారత్, ముఖ్యంగా తెలంగాణలో మాత్రం కోతుల బెడద పెద్ద సమస్యగా మారింది.