చైల్డ్ పోర్నోగ్రఫీ చూసే వారిని TG సైబర్ సెక్యూరిటీ బ్యూరో ట్రేస్ చేస్తోంది. వీడియోలను చూస్తూ, షేర్ చేస్తున్న ఓ వ్యక్తిని ఖమ్మం పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నేషనల్ సెంటర్ ఆఫ్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ సంస్థ ‘సైబర్ టిప్ లైన్’ ద్వారా చైల్డ్ పోర్నోగ్రఫీ బ్రౌజింగ్‌పై పోలీసులకు అలర్ట్స్ పంపిస్తుంటుంది. గతేడాది TGకి 97,556 అలర్ట్స్ వచ్చాయి. 854 FIRలు నమోదవగా, 376 మంది అరెస్టయ్యారు.