హైదరాబాద్ అంటే బిర్యానీ అన్న మాటను మరోసారి నిజం చేస్తూ, 2025లోనూ దేశవ్యాప్తంగా ‘బిర్యానీ క్యాపిటల్’గా నగరం అగ్రస్థానంలో నిలిచింది. స్విగ్గీ 2025 రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్‌లో ఏడాదిలో 1.75 కోట్ల బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి. ఇందులో 61% అంటే 1.08 కోట్ల ఆర్డర్లు చికెన్ బిర్యానీవే. దోస, ఇడ్లీ కూడా టాప్ డిష్‌ల్లో చోటు దక్కించుకున్నాయి. తీపి పదార్థాల్లో బూందీ లడ్డూ ముందంజలో నిలిచింది. సాయంత్రం చిరుతిళ్లలో నాన్‌వెజ్‌కు ఎక్కువ డిమాండ్ కనిపించగా, హై-ప్రోటీన్ ఆహార ఆర్డర్లలో హైదరాబాద్ దేశంలో మూడో స్థానంలో నిలిచింది.