నిర్మల్ అటవీశాఖ అధికారుల ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రియదర్శిని నగర్ పాత బస్టాండ్ పరిసరాల్లో గాలిపటాలు, మాంజలు విక్రయిస్తున్న దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అటవీ క్షేత్రాధికారి రామకృష్ణ రావు, సంతోష్ కుమార్, నజీర్ ఖాన్ (ఉప అటవీ క్షేత్రాధికారులు) పాల్గొన్నారు. ఎఫ్‌ఆర్‌ఓ రామకృష్ణ రావు మాట్లాడుతూ, చైనా మాంజ విక్రయించకూడదని దుకాణదారులను హెచ్చరించారు. నిషేధిత మాంజను విక్రయించినట్లు తేలితే పర్యావరణ పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.