ఆదివాసి యువత అన్ని రంగాల్లో ఎదగాలి: ఆదిలాబాద్ జిల్లా SP
NEWS Jan 08,2026 11:25 pm
మారుమూల ఆదివాసీ గ్రామాల ప్రజలు-పోలీసుల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆదిలాబాద్ జిల్లా పట్టగూడ గ్రామంలో ఉచిత దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ, ఆదివాసీ ప్రజలు చదువుపై దృష్టి పెట్టి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. యువత మాదకద్రవ్యాల వ్యసనాలకు దూరంగా ఉండి కుటుంబ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. 8 గ్రామాల ప్రజలు పాల్గొని దుప్పట్లు స్వీకరించారు.