భారత్‌లో బంగారం, ఆభరణాలపై వినియోగదారుల దృక్పథంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సంప్రదాయ పెట్టుబడితో పాటు ఫ్యాషన్‌గా కూడా నగలను పరిగణిస్తున్నారు. Deloitte India నివేదిక ప్రకారం 86 శాతం మంది బంగారం, నగలను సంపద సృష్టికి ఉత్తమ మార్గంగా భావిస్తున్నారు. యువత తేలికపాటి, మినిమలిస్ట్ డిజైన్లకు, వెండి, ప్లాటినం వైపు మొగ్గు చూపుతోంది. మార్కెట్‌లో ఈ మార్పు కీలకమని డెలాయిట్ ఇండియా భాగస్వామి Praveen తెలిపారు.