లమడుగు గోదావరి తీరంలో శుక్రవారం ఉదయం నుంచి మెస్రం వంశీయులు పవిత్ర గంగా జల సేకరణను ప్రారంభించారు. ఈ గంగా జలంతో ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ ప్రసిద్ధ నాగోబా ఆలయంలో ప్రతిష్ఠించిన ఇందిరా దేవికి అభిషేకం నిర్వహిస్తారు. జనవరి 10న కాలినడకన బయలుదేరిన మెస్రం వంశీయులు వారం రోజులకు పైగా యాత్ర కొనసాగించి, ఈ రోజు కలమడుగు గోదావరికి చేరుకున్నారు. పుణ్యస్నానాల అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో గంగా జలాన్ని సేకరించారు. అనంతరం నాగోబా ఆలయానికి బయలుదేరారు.