అయ్యప్ప భక్తుల శరణుఘోషలు, విపరీతమైన చలి.. ఇవేమీ లెక్కచేయకుండా నాన్న ఛాతీపై హాయిగా నిద్రపోతున్న కన్నెస్వామి ఫొటో వైరలవుతోంది. తండ్రితో కలిసి ఆ మణికంఠుడిని దర్శించుకుని ఈ చిన్నారి అలసిపోయింది. నాన్న గుండెచప్పుడే గుడి గంటలుగా, ఆయన ఒడే పట్టుపాన్పుగా, ప్రపంచంలోనే సురక్షిత ప్రదేశంగా భావించి నిద్రపోయింది. ఆ తండ్రి కూడా బిడ్డ నిద్రకు భంగం కలిగించకుండా కదలకుండా ఉండిపోయాడు. ఎంతైనా అమ్మాయికి తండ్రే కదా సూపర్ హీరో.