మామడ మండలం పొన్కల్ గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న సదర్మాట్ బ్యారేజీకి సంబంధించిన మిగిలి ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు అధికారి జానకి షర్మిలతో కలిసి కలెక్టర్ సదర్మాట్ బ్యారేజీని పరిశీలించారు. త్వరలో బ్యారేజీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లను సమీక్షించారు. ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.