ప్రారంభమైన 'గోరంట్ల' మూవీ
NEWS Jan 08,2026 08:24 am
గోరంట్ల ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ నుంచి కొత్త సినిమా రాబోతోంది. మణికొండలోని అయ్యప్ప స్వామి ఆలయంలో స్క్రిప్ట్ కు సంబంధించి పూజ కార్యక్రమాలు జరిగాయి. గోరంట్ల సత్యం దర్శక త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని, గోరంట్ల రజిత, శ్రీహర్షిత నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాల్లో డైరెక్టర్ చిన్ని చరణ్, సీనియర్ జర్నలిస్టులు అడ్ల రాంబాబు, TJF స్టేట్ సెక్రటరీ స్వామి ముద్దం, ప్రెస్ క్లబ్ EC మెంబర్ దయ్యాల అశోక్, కే.శ్రీధర్, కో-డైరెక్టర్ AL మూర్తి, తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామని దర్శకుడు గోరంట్ల సత్యం తెలిపారు.