చైనా మాంజాపై పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్
NEWS Jan 07,2026 01:55 pm
సంక్రాంతి పండుగ వేళ చైనీస్ మాంజా అమ్మకాలు, నిల్వ, రవాణా, వాడకంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986 ప్రకారం దీనిపై పూర్తి నిషేధం ఉందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఇది ప్రమాదకరమని ప్రజలు, పిల్లలు వీటికి దూరంగా ఉండాలని చెప్పారు. చైనీస్ మాంజాను విక్రయించేవారు, నిల్వ చేసేవారు, రవాణా చేసేవారు, వాడేవారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.