ఆది శ్రీనివాస్‌కు కథలాపూర్ గ్రామ వినతి
NEWS Jan 07,2026 02:02 pm
కథలాపూర్ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలపై సర్పంచ్ శేఖర్, పాలకవర్గం చర్చించి నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయ పత్రాన్ని హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ప్రభుత్వ విప్, MLA ఆది శ్రీనివాస్ నివాసంలో కలిసి అందజేశారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రజా అవసరాలు, చేపట్టాల్సిన పనులపై విప్‌కు వివరించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాయితి నాగరాజ్, స్టేట్ ఫిషర్మెన్ కమిటీ ప్రధాన కార్యదర్శి కల్లెడ గంగాధర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కస్తూరి నరేష్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.