పెద్దపల్లి: రంగాపూర్ సమీపంలో అర్ధరాత్రి అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా మట్టి దందా కొనసాగుతోందని ఆరోపిస్తూ, ఒక జేసీబీతో పాటు 5 ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఘటనను రెవెన్యూ, పోలీసు అధికారులకు తెలియజేసిన గ్రామస్తులు, అక్రమ మట్టి తరలింపుపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.