పోలీస్ స్టేషన్–ఎంఆర్వో ఆఫీస్ మధ్యలో తాళం వేసిన ఇల్లు దోపిడీ
NEWS Jan 07,2026 12:13 pm
మెట్‌పల్లి: పట్టణంలోని కళానగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో, అలాగే ఎంఆర్వో కార్యాలయానికి సమీపంలో ఉన్న తాళం వేసిన ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ఇంటికి వేసిన తాళాన్ని గొడ్డలితో పగలగొట్టి లోపలికి చొరబడి, బీరువాను ధ్వంసం చేసి ఐదున్నర తులాల బంగారం, 60 తులాల వెండి, రూ. 2.50 లక్షల నగదు, 15 పట్టు చీరలు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.