TGSRTC హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాలకు ఏకంగా 5 వేలకుపైగా స్పెషల్ బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు 2500 బస్సులు.. ఏపీకి 3 వేల బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 9వ తేదీ నుంచి సొంతూరుకు వెళ్లే ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ఈ స్పెషల్ బస్సులు నడవనున్నాయి.