వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన డెల్సీ రోడ్రిగ్జ్ సత్యసాయి బాబా భక్తురాలు కావడం విశేషంగా మారింది. మదురో స్థానంలో ఆమెను ఆ దేశ సుప్రీంకోర్టు నియమించింది. ఉపాధ్యక్షురాలిగా ఉన్న సమయంలో పలుమార్లు పుట్టపర్తిని సందర్శించారు. 2023, 2024కి చెందిన ఆమె పర్యటనల ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మదురో కూడా సత్యసాయిని గురువుగా భావించేవారు.