CM కప్ క్రీడలకు ఎమ్మెల్యేలకు DYSO ఆహ్వానం
NEWS Jan 05,2026 11:55 pm
నిర్మల్ జిల్లాలో నిర్వహించనున్న 2వ సీఎం కప్ పోటీలు–2026 ఏర్పాట్లకు సంబంధించి జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి నిర్మల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వెడ్మ బొజ్జు పటేల్లను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పోటీల నిర్వహణ ఏర్పాట్లపై ఎమ్మెల్యేలు వివరాలు అడిగి తెలుసుకుని, సీఎం కప్‌ను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పోటీలకు సంబంధించిన పూర్తి వివరాలను డీవైఎస్‌వో ఎమ్మెల్యేలకు వివరించారు. ఎస్‌ఎఫ్‌జీ సెక్రటరీ రవీందర్ గౌడ్, వ్యాయామ ఉపాధ్యాయులు భోజన్న, ఇమ్రాన్, పోశెట్టి పాల్గొన్నారు.