జాతీయస్థాయి పాటల పోటీల్లో జిల్లా పేరు నిలబెట్టాలి: నిర్మల్ జిల్లా కలెక్టర్.
NEWS Jan 05,2026 11:18 pm
యువజన ఉత్సవాల పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన జిల్లా విద్యార్థులను కలెక్టర్ అభిలాష అభినవ్ తన చాంబర్‌లో అభినందించారు. యువజన ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పాటల పోటీల్లో మంజుల, కావ్య, శ్రుతి, అనుష్క, సాత్విక, సాయి కృప, గంగామణి, శ్రీనిధి, శివప్రసాద్, బ్రహ్మయ్యల బృందం ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఈ బృందం ఢిల్లీలో జరగనున్న జాతీయస్థాయి పాటల పోటీలకు ఎంపికైంది. అక్కడ సత్తా చాటి జిల్లా పేరును నిలబెట్టాలని కలెక్టర్ ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.