ఖానాపూర్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వేడ్మా బుజ్జి పటేల్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. ఖానాపూర్ ప్రాంతం నుంచి ఏటా సుమారు 2 వేల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పూర్తి చేస్తున్నప్పటికీ డిగ్రీ కళాశాల లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలో మంజూరైన మైనారిటీ రెసిడెన్షియల్, మహాత్మ జ్యోతిబా ఫూలే పాఠశాలలు–కళాశాలలకు సొంత భవనాలు మంజూరు చేయాలని, అలాగే ఆదిలాబాద్ బీఈడీ కళాశాలలో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.