చెన్నూరు పట్టణంలో కరాటే పోటీలు నిర్వహించారు. టైగర్ ఫిస్ట్ కుంఫు మార్షల్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన చిన్నారులకు చెన్నూరు పట్టణ CI దేవేందర్ రావు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన మాస్టర్ల వద్ద మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పొందితే మనోధైర్యం పెరుగుతుందని, అత్యవసర పరిస్థితుల్లో స్వీయ రక్షణకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.