చెన్నూరు సమీపంలో నిషేధిత అటవీ జంతువును వేటాడి మాంసాన్ని విక్రయిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మాంసాన్ని విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. పట్టుబడిన వారిని విచారణ నిమిత్తం FDO కార్యాలయానికి తరలించారు. అటవీ జంతువు మాంసాన్ని ఎవరికి విక్రయించారు, ఎవరు కొనుగోలు చేశారన్న అంశాలపై లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.