మెట్ పల్లిలో యదేచ్ఛగా మొరం దందా
పట్టించుకోని రెవెన్యూ, పోలీస్ అధికారులు
NEWS Jan 05,2026 11:02 pm
మెట్ పల్లిలో గత కొన్ని నెలల నుండి మోరం దందా కొనసాగుతున్నప్పటికీ రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ శివారు నుండి తరలిస్తున్న మొరం ట్రాక్టర్ల వల్ల కళనగర్ లో అర్ధరాత్రి ప్రయాణించడానికి కాలని వాసులు జంకుతున్నారు. అర్థరాత్రి వేళ ట్రాక్టర్ల శబ్ధానికి చిన్న పిల్లలు నిద్రలో ఉలికిపడుతున్నారు. రోడ్డుపై పడుకొని ఉన్న కుక్క పిల్లలపై నుండి ట్రాక్టర్ల దూసుకెళ్తున్నాయి. ట్రాక్టర్ వీధులలో నడపరాక ఇంటి గద్దెల(మెట్లు)పై నుండి దూసుకెళ్తున్నాయి. పోలీస్, రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తు వీడి అక్రమ మోరం తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.