ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసనమండలిలో కన్నీటి పర్యంతమయ్యారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో తనను అణగదొక్కే ప్రయత్నం జరిగిందని.. స్వేచ్ఛ లేకుండా ఆంక్షల మధ్య పని చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లినప్పుడు పార్టీ తనకు అండగా నిలవలేదని.. సొంత మీడియా కూడా కనీస మద్దతు ఇవ్వలేదని వాపోయారు. ఇది ఆస్తుల గొడవ కాదు.. ఆత్మగౌరవ పోరాటమని స్పష్టం చేశారు.