కథలాపూర్ మండల కేంద్రంలోని 4వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో రోడ్లపైకి మురుగు నీరు చేరింది. పరిస్థితిని గమనించిన వార్డ్ మెంబర్ శేఖర్ తన సొంత ఖర్చులతో జెసీబీ సహాయంతో డ్రైనేజీని శుభ్రం చేయించారు. అలాగే మహాలక్ష్మి ఆలయం వద్ద పెరిగిన తుమ్మ చెట్లను తొలగించి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచిన ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. తక్కువ సమయంలో చేసిన పనులకు వార్డు సభ్యులు ఆయనను అభినందించారు.