అదిలాబాద్ జిల్లాలోని సోయా రైతులు తాము పండించిన పంటను కొనుగోలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని గత వారం రోజుల నుండి నిరసన చేపట్టారు. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో సోయా రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. జోగు రామన్న మాట్లాడుతూ సోయా రైతులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని, రైతుల బాధ రాష్ట్ర ప్రభుత్వానికి వినపడడం లేదని, రైతులు పండించిన సోయా పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.