పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో 06-01-2026 తేదీన నిర్వహించాల్సిన వివిధ రకాల షీల్డ్ టెండర్లకు సంబంధించిన బహిరంగ వేలాలను కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్లు ఆలయ నిర్వహణ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. రద్దైన వేలాలకు సంబంధించిన తిరిగి నిర్వహించాల్సిన తేదీని త్వరలోనే నిర్ణయించి, అధికారికంగా ప్రకటించడం జరుగుతుందని తెలిపారు.